BIG UPDATE ఏపీ మున్సిపల్ ఎన్నికలపై.

ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు హ‌డావిడి మొదలైంది. ఇప్ప‌టికే అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల కోసం సిద్దం అయ్యాయి. ప్ర‌భుత్వం కూడా ఎన్నిక‌ల కోసం రెడీ అయింది. జాబితా వార్డుల ప్ర‌క్రియ‌ను సిద్దం చేస్తోంది.
ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది ఈసీ. ఇక స్టేట్ లో వార్డుల వారీగా , బీసీ, ఎస్సీ,ఎస్టీ ఓట‌ర్ల‌ను గుర్తించ‌నున్నారు. మ‌హిళా ఓట‌ర్ల‌ను వారి కేట‌గిరీ కింద గుర్తించ‌నున్నారు, ఈ గుర్తింపు త‌ర్వాత రిజర్వేష‌న్లు ఖ‌రారు చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌కి మొత్తం 9 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఇవన్నీ పూర్తి చేసి అక్టోబ‌ర్ తొలివారంలో రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌ట‌న చేస్తారు అని అంచ‌నా వేస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపుతో రిజ‌ర్వేష‌న్లు 50 శాతం ప‌రిమితి దాటుతున్నాయి.ఈ అంశం ఇప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో ఎవ‌రైనా కోర్టుకు వెళ్ల‌వ‌చ్చు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో 12 మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, అలాగే 29 మున్సిపాలిటీల్లో వార్డుల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అవుతాయి. దీని వ‌ల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మ‌హిళా ఓట‌ర్ల గుర్తింపు ప్ర‌క్రియ జ‌రుగుతుంది ఇది మూడు రోజుల్లో చేయ‌నున్నారు. దీని కోసం డోర్ టు డోర్ సిబ్బంది స‌ర్వే నిర్వ‌హిస్తారు.

ఎస్టీ ఓటర్లను ఆకుపచ్చ బాల్ పాయింట్ పెన్ తో టిక్ పెడ‌తారు
ఎస్సీ ఓటర్లను రెడ్ బాల్ పాయింట్ పెన్ తో టిక్ పెడ‌తారు
మహిళలు, బీసీ ఓటర్లను బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ తో టిక్ పెడ‌తారు.

ఇక ఈ ముసాయిదా జాబితా సెప్టెంబ‌ర్ 26 న మున్సిప‌ల్ రెవెన్యూ కార్యాల‌యాల్లో నోటీసు బోర్డులో ఉంచుతారు. రెండు రోజులు అభ్యంత‌రాల‌కు స‌మ‌యం ఇస్తారు. ఇక సెప్టెంబ‌ర్ 30 తేదిలోపు విచార‌ణ చేసి అక్టోబ‌ర్ ఒక‌టిన మొత్తం ఓట‌ర్ల తుది జాబితా ఫారం 6లో ప్ర‌చురిస్తారు. దానిని మున్సిప‌ల్ ప‌రిపాల‌న క‌మిష‌న‌ర్ డైరెక్ట‌ర్ కు అంద‌చేస్తారు. మొత్తానికి అక్టోబ‌ర్ 9 లోపు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క్రియ పూర్తి అయి నోటిఫికేష‌న్ రావ‌చ్చు.

Leave a Comment