వెన‌క్కి త‌గ్గేదే లేదంటున్న జ‌న‌సేన‌..

లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన కచ్చితంగా బలంగా ఉన్న అన్ని చోట్ల పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్క‌డ పిఠాపురంలో త్రిమెన్ కమిటీ పనితీరు బాగోలేదు అన్నారు. అలాగే ఇక్కడ కొత్త క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. దీంతో జిల్లాలో కొత్త ఉత్తేజం వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రకటనతో పార్టీలో కేడర్ కూడా చాలా ఉత్తేజంగా ఉన్నారు.

ముఖ్యంగా కాకినాడ జిల్లాలో చేరికలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన ఎంత పర్సంటేజ్ పోటీకి మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు చర్చ . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పక్క ప్రతిపక్షంలో పోటీకి సిద్ధంగా ఉంది . మరో పక్క కూటమిలో తెలుగుదేశం జనసేన బిజెపి ఎన్ని స్థానాల్లో ఎవరెవరు పోటీకి నిలబడతారు అనేది వీరి తొలి మీటింగ్ లో క్లారిటీ రానుంది.

మాధవ్ అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ భేటీలో ఎటువంటి ప్రకటన చేస్తారు అనేది ఒక చ‌ర్చ‌. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం 60 శాతం టికెట్లు 30 శాతం జనసేన 10 శాతం బిజెపి తీసుకుంటే రాజకీయంగా పార్టీలో ఉన్న క్యాడర్ కి కూడా న్యాయం చేసినట్టు ఉంటుందంటూ ఒక చర్చ నడుస్తోంది. మరి దీనికి తెలుగుదేశం ఒప్పుకుంటుందా పవన్ కళ్యాణ్ బిజెపి డిమాండ్ కి వారు ఒకే అంటారా ఇదే ఇప్పుడు చర్చ.

సో చూడాలి మొత్తానికి ఆరు జిల్లాల్లో పూర్తిగా జనసేన తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది. 30 నుంచి 35% ఆ జిల్లాల్లో అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురు అధినేత‌లు భేటీ ఎప్పుడు అవుతారనేది ఒక చర్చ‌. అక్టోబర్ 9వ తేదీలోపు ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి డేటు ఎప్పుడైనా రావచ్చు.

Leave a Comment