మన శరీరానికి విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్స్ ఇలా అన్నీ కూడా అవసరమే . అనేక ఆహార పదార్థాల ద్వారా మన శరీరం వీటిని తీసుకుంటుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పొటాషియం. మన గుండెకి ఇది చాలా ముఖ్యం. అయితే పొటాషియం విషయంలో మనం చూసుకున్నట్లయితే గుండె సక్రమంగా పనిచేయాలన్న కొట్టుకోవాలన్నా ఇది చాలా కీలకమైంది. వైద్యులు కూడా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా కండరాల సంకోచం, సాధారణ కండరాల పనితీరుకి పొటాషియం చాలా అవసరం. నరాల ద్వారా సంకేతాలు సరిగ్గా వెళ్లడానికి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
శరీరంలో తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల బిపి కూడా నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని లిక్విడ్స్ ఎలక్ట్రోలైట్స్ ద్రవాలు సమతుల్యంగా ఉండడానికి కూడా ఇది ఎంతో సహాయం చేస్తుంది. పొటాషియం తగ్గిందంటే అనేక సమస్యలు వస్తాయి. ఒకవేళ శరీరంలో పొటాషియం పెరిగినా అనేక ఇబ్బందులు వస్తాయి. చాలా తక్కువ ధరకు దొరికేటటువంటి ఫ్రూట్స్లో బనానా ఒకటి. బనానా లో చాలా ఎక్కువగా ఉంటుంది పొటాషియం. అలాగే కొబ్బరినీళ్లు, బంగాళదుంప, బీన్స్, పాలకూర, టమోటో, చిలకడదుంపల్లో కూడా పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇక మీరు తినేటటువంటి పప్పుల్లో శనగలు రాజ్మా ఎండిన ఆఫ్రికాట్స్, ఎండు ద్రాక్ష, పాలు, పెరుగు, డైరీ ప్రొడక్ట్స్ లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నిత్యం తీసుకునేటటువంటి ఈ పొటాషియం మోతాదు మనకి సరిపోతుంది. సాధారణంగా ఆహారం ద్వారా వచ్చే పొటాషియం చాలా వరకు సురక్షితమైనది. ఒంట్లో పొటాషియం పెరిగితే మాత్రం అది చాలా వరకు చెడు చేస్తుంది.
వికారం వాంతులు కడుపులో అసౌకర్యం మోషన్స్ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. మీ శరీరంలో పొటాషియం ఎక్కువైతే ఇవన్నీ కూడా మీ శరీరం అత్యధికంగా ఉందని చూపిస్తుంది. మెట్లపై నడుస్తూ ఉన్న కండరాలు బలహీనత అవుతుంది అలసట వస్తుంది జలదరింపు వస్తుంది హృదయ స్పందన మారిపోతుంది అందుకే పొటాషియం అతిగా ఉన్నా ఇబ్బందే.
ఒకవేళ తక్కువగా ఉన్న ఇబ్బంది. ముఖ్యంగా చూసుకుంటే కిడ్నీల పనితీరు తగ్గిన వారిలో పొటాషియం బాగా పెరిగిపోతుంది . ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఎప్పటినుంచో వాడుతూ ఉన్నవారికి కూడా ఈ ఇబ్బంది వస్తుంది. సడెన్ గా రక్తంలో పొటాషియం పెరిగిపోవచ్చు కాబట్టి నిత్యం మందులు తీసుకునేవారు పొటాషియం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొటాషియం ఉన్న ఆహారాలు ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడిని అడిగి తెలుసుకోండి. అంతేకాకుండా రోజుకి రెండు లేదా ఒక్క అరటిపండు మాత్రమే తీసుకోవాలి. అతిగా అరటి పండ్లు తీసుకున్నా పొటాషియం మోతాదు పెరిగిపోతుంది.







