ఆంధ్రప్రదేశ్ లో లోకల్ బాడీ ఎన్నికల హాడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం కార్పొరేషన్ పై చర్చ జరుగుతోంది. ఇక్కడ మేయర్ గా ఎవరికి అవకాశం రానుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా విజయనగరం కార్పొరేషన్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నా టీడీపీ నుంచి ఆశావహుల లిస్ట్ ఎక్కువగా ఉంది. మరి ఎవరికి అవకాశం రానుంది వారు ఎవరు అనేది ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
విజయనగరం జిల్లా కేంద్రంగా ఉంది. సుమారు విజనయనగరం కార్పొరేషన్ పరిదిలో 2.20 లక్షల ఓటర్లు ఉన్నారు. విజయనగరంలో వైసీపీ జనసేన టీడీపీ ఇక్కడ ఫోకస్ చేశాయి. వైసీపీ తరపున కొలగట్ల వీరభద్రస్వామి ఇంచార్జ్ ఆయన ఎవరి పేరు చెబితే వారికి అవకాశం రావచ్చు అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వెంపటాపు విజయలక్ష్మికి అవకాశం ఇచ్చారు వైసీపీ తరపున ఆమె మేయర్ అయ్యారు, గత ఎన్నికల్లో 50 డివిజన్లకు 48 కైవసం చేసుకుంది.
బీసీలు చాలా మంది వైసీపీ తరపున వినిపిస్తున్నారు, ఒకవేళ జనరల్ ఓసికి కేటాయిస్తే అక్కడ నుంచి కొలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణికి అవకాశం ఇవ్వచ్చు.
టీడీపీ నుంచి చాలా మంది సీనియర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో పోటి చేసిన కంది శకుంతల మరోసారి తనకు అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నారు. భర్త మురళినాయుడు కూడా అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు
వీరిది తూర్పుకాపు వర్గం.
ఇక మరో సీనియర్ నాయకుడు నర్సింగరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలి అని అడుగుతున్నారు. పార్టీలో 40 ఏళ్లుగా సేవ చేస్తున్నారు. మండల అధ్యక్షుడు జిల్లా యువత అధ్యక్షుడుగా పని చేశారు, ఏఎంసీ చైర్మన్ గా ఉన్నారు.అశోక్ గజపతి రాజుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో వర్క్ చేస్తున్నారు
తర్వాత ప్రసాదుల ప్రసాద్ ఆయన రేసులో ఉన్నారు, ఆయన తల్లి కనకమహాలక్ష్మి రెండు సార్లు చైర్మన్ గా పని చేశారు . ప్రసాద్ తండ్రి కూడా చైర్మన్ గా పనిచేశారు, వీరిది యాదవ సామాజిక వర్గం.అశోక్ గజపతి రాజు వర్గంగా జిల్లాలో పేరు పొందారు. వీరు రేసులో ఉన్నారు.
టీడీపీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు గంటా రవి పేరు వినిపిస్తోంది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అవనపు విజయ్ పేరు తెరమీదకు వచ్చింది. ఆర్దికంగా బలమైన నేత. ఆయన తండ్రి సూరిబాబు మున్సిపల్ చైర్మన్ గా గతంలో పని చేశారు. సో చూడాలి వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో.







