తెలుగులో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తలు నిలుస్తూ ఉంటాడు. తన కంటితో ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో అతని వీడియోలకి మిలియన్స్ కొద్ది వ్యూస్ ఉంటాయి. మనకు తెలియని అనేక రకమైనటువంటి విషయాలను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్నిటిని చూపిస్తూ బాగా ట్రెండింగ్లో ఉంటాడు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఎంతటి రచ్చ జరిగిందో తెలిసిందే. ఒంటరిగా ఉద్యమం చేశాడు అన్వేష్.
తాజాగా అన్వేష్ నాగార్జునపై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొంతమంది నాగార్జున ఫ్యాన్స్ కూడా దీనిపై సీరియస్ అవుతున్నారు.. అయితే ప్రజల జీవన విధానం సంస్కృతి అలవాట్లు పరిచయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ఇలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న నాగార్జున గురించి బిగ్ బాస్ గురించి కామెంట్లు చేయడం పై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై అన్వేష్ చేసిన విమర్శలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మీద అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి . ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం చూస్తే అగ్ని పరీక్ష 2 కార్యక్రమానికి సంబంధించి కొంతమంది కంటెస్టెంట్లు, స్కూల్ కాలేజీలకు వెళ్లి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు.
అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదువుకునే స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లి రియాల్టీ షో కంటెస్టెంట్స్ ప్రచారం చేయడమేంటి , ఆ స్కూల్ యాజమాన్యాలు ఎందుకు దీనికి ఒకే చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూ హెస్టుగా ఉన్న నాగార్జున వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శలు చేశాడు అన్వేష్ .
స్కూల్లో కాలేజీలో ప్రమోట్ చేయకూడదని సీరియస్ అయ్యాడు. సుమారు 65 సంవత్సరాలు వచ్చిన నాగార్జున ఇలా ఎందుకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా త్వరలో తాత కాబోతున్నారు. ఇలాంటి వాటిని మీరు ఖండించాలి కదా, సైలెంట్ గా ఉండకూడదంటూ నాగార్జున పై సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా జీవితంలో మిగిలిన సమయాన్ని నలుగురికి ఉపయోగపడేలా పనులు చేయాలంటూ సూచించాడు. ఇలాంటి పనులు చేస్తే నరకానికి వెళ్తారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నాగార్జున ఫ్యాన్స్ మండిపడుతున్నారు.







