ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్దమైంది చాలా మంది ఆశావహులు సీట్లు కోసం టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈసారి ఎన్నికల్లో చాలా మంది వారసులు ఎంట్రీకి సిద్దం అవుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఎంతో మంది తమ వారసులతో ఎంట్రీ ఇప్పించాలి అని రెడీ అయ్యారు. ముఖ్యంగా రాజధానిలో కీలక ప్రాంతం విజయవాడ, ఇక్కడ మేయర్ సీటు కోసం ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు ఒకరు. ఆయన తన కుమారుడిని ఇక్కడ నుంచి మేయర్ గా బరిలో దింపాలి అని చూస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన కుమారుడి బయోడేటా అందించారు. తన కుమారుడు చేసిన సర్వీస్ అలాగే పార్టీలో ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు ఇవన్నీ కూడా తెలియచేశారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలి అని సిద్దార్ద్ పేరు పరిశీలన చేయమని రిక్వెస్ట్ చేశారు. మరి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇప్పటికే బొండా ఉమా తనకు మంత్రి పదవి రాలేదు అని ఇటీవల అలక బూనారు, అయితే తనకు మంత్రిపదవి రాకపోయినా తన కుమారుడికి మేయర్ అవకాశం ఇప్పించండి అని కోరుతున్నారు. విజయవాడ సెంట్రల్ లో మంచి పేరు ఉన్న లీడర్, అంతేకాకుండా బోండా సిద్దార్ద్ కూడా గ్రౌండ్ లెవల్ లో ఎంతో బాగా వర్క్ చేస్తున్నాడు. ఇవన్నీ తన కుమారుడికి కలిసి వస్తాయి అని ఆలోచన చేస్తున్నారు.
అయితే ఈ పదవి కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో జనసేన నుంచి ఇటీవల పార్టీలో చేరిన సీతారామ్, అలాగే టీడీపీ నుంచి వంగవీటి రాధా పేరు వినిపిస్తోంది. ఇక వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ కూడా ఏదో ఒక పార్టీలో చేరి ఇక్కడ మేయర్ గా నిలబడాలి అని చూస్తున్నారు. సో విజయవాడ వేదికగా రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.







