మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ వీరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్ వస్తున్నా ఫ్యాన్స్ వదలడం లేదు. కాకా టైటిల్ చాలా మందికి విపరీతంగా నచ్చింది. వాల్తేరు వీరయ్య వంటి మాస్ ఇమేజ్ సినిమా తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు విపరీతమైన స్పందన వచ్చింది.
ఈ చిత్రాన్ని జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా ఇంకా ఆలస్యం అవుతుందా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది.
దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే 2027 సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ధియేటర్ల కొరత కూడా పెద్ద సమస్యగా ఉండనుంది. ఇది మిగిలిన సినిమాల పై కూడా ధియేటర్ల విషయంలో పెద్ద ఇబ్బంది అవ్వనుంది.
అందుకే మేకర్స్ కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నట్లు వార్తలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా ఎలాంటి పోటీ లేని సమయంలో వస్తే ఫుల్ గా ధియేటర్లు సర్దుబాటు అవుతాయి అని ఆలోచిస్తున్నారు, అందుకే కాకాను 2027 సమ్మర్ సీజన్‌కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వేసవి సెలవులు కూడా సినిమా కలెక్షన్స్ కు మరింత ఊతం ఇస్తాయి అని ఆలోచిస్తున్నారట.
అయితే ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి కాని , మేకర్స్ నుంచి డైరెక్టర్ నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకూ రాలేదు. సో ఈ వార్త గాసిప్ గా ఉంటుందా లేదా ప్రకటన వస్తుందా అనేది మాత్రం ఒక చర్చ నడుస్తోంది. ఈ ప్రశ్నలకు అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







