వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పాదయాత్ర డేట్ బయటకు వచ్చింది. అఫీషియల్ గా ప్రకటన రాకపోయినా ఈ సమయంలో ఆయన పాదయాత్ర ఉండవచ్చు అని డేట్ వినిపిస్తోంది.
2027 జూలై 8 న వైయస్సార్ జయంతి సందర్బంగా ఆయన పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభిస్తారు అని అంటున్నారు. దాదాపు 16 నెలల పాటు ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఎక్కడ నుంచి ఈ పాదయాత్ర చేయాలి అనేది గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.
ఒకసారి మనం 2017లో ఆయన చేసిన ప్రజా సంకల్పయాత్ర గురించి చూసినట్లు అయితే
ఇడుపులపాయ నుంచి 6 నవంబర్ 2017 పాదయాత్ర ప్రారంభించారు జగన్, తన తండ్రి సమాది దగ్గర నివాళి అర్పించి అక్కడ నుంచి ఆయన నడక ప్రారంభించారు. వేలాది మంది జగన్ వెంట నడిచారు.
అన్నీ చోట్లా రావాలి జగన్ – కావాలి జగన్ అనే స్లోగన్ పెద్ద ఎత్తున వినిపించింది. జగన్ మొత్తం 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు నడిచారు. యాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.
ప్రజా సంకల్పయాత్ర 341 రోజులు చేశారు
3,648 కి.మీ. నడక నడిచారు
13 జిల్లాలు జగన్ కవర్ చేశారు
ఏపీలో 134 అసెంబ్లీ నియోజకవర్గాలు మీదుగా పాదయాత్ర సాగింది
2,516 గ్రామాలు కవర్ చేశారు
54 మున్సిపాలిటీలు కవర్ చేశారు
8 కార్పొరేషన్లు పాదయాత్ర చేశారు
ఏపీలో మొత్తం ఈ సమయంలో 124 సభలు/సమావేశాలు చేశారు
55 ఆత్మీయ సమ్మేళనాలు జరిపారు.
చివరగా ఇచ్ఛాపురం చేరుకోవడంతో యాత్ర ముగిసింది. ఈసారి సుమారు జగన్ పాదయాత్ర 4200 కిలోమీటర్లు ఉంటుంది అని అంటున్నారు. అంతేకాదు 18 నెలల వరకూ ఉండవచ్చు అంటున్నారు.







