విజ‌యసాయిరెడ్డి కొత్త పార్టీవెనుక ఎవ‌రు న‌డుస్తారంటే ?

ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీ స్ధాపిస్తాను అని తెలిపారు. ముందు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గురించి తెలియ‌చేస్తాను, ఆ త‌ర్వాత పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంది అని తెలిపారు సాయిరెడ్డి. ఇక వైసీపీ టీడీపీ ఈ రెండు కూడా ఫ్యాక్ష‌న్ పార్టీలు అంటూ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూట‌మి టీడీపీ జ‌న‌సేన బీజేపీ ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే మ‌రో ప్ర‌త్యామ్నాయం కావాలి అని కోరారు. అందుకే తాను పార్టీ పెడుతున్నాను అని తెలిపారు విజ‌య‌సాయిరెడ్డి.

దీంతో ఆయ‌న త్వ‌ర‌లో కొత్త రాజకీయ పార్టీతో ప్ర‌జ‌ల్లోకి రానున్నారు అనేది క్లారిటీ వ‌చ్చింది. అయితే గ‌తంలో ఆయ‌న వైసీపీకి త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజ‌కీయ స‌న్యాశం అని ప్ర‌క‌ట‌న చేశారు. కొంత కాలం వ్య‌వ‌సాయం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలోకి వెళ‌తారు అని వార్త‌లు వినిపించాయి. కాని ఆయ‌న ఏ పార్టీలో చేర‌లేదు, అనేక అంశాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ఇటీవ‌ల తాను కొత్త రాజ‌కీయ పార్టీ పెడుతున్నా అని ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యం నుంచి, అంద‌రిలో దీని గురించి చ‌ర్చ న‌డిచింది. నేడు మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతో దీనిపై క్లారిటీ రానుంది అని అనుకున్నారు. అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. అయితే ఆయ‌న పెద్ద స్ధాయిలో త‌న వ‌ర్గంతో క‌లిసి సొంత పార్టీ ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో చేయ‌నున్నారు. అంతేకాదు త్వ‌ర‌లో మీడియా హౌస్ పెడ‌తాను స్వ‌తంత్య్రంగా న‌డుపుతాను అని తెలిపారు సాయిరెడ్డి.

ఆయ‌న మీడియా హౌస్ కూడా ద‌స‌రాకి స్టార్ట్ అవ్వ‌నుందని తెలుస్తోంది. మ‌రి ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు స్పేస్ ఉందా అనేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌. ఈ వ‌య‌సులో రాజ‌కీయ పార్టీ పెట్టి ఎలా పోరాటం చేస్తారు అనేది కూడా చాలా మంది నుంచి ఓ కొత్త ప్ర‌శ్న వ‌స్తోంది. ఇక వైసీపీలో కోట‌రితో వేగ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చారు సాయిరెడ్డి, మ‌రి త‌న పార్టీలో ఎవ‌రికి పెద్ద పీట వేస్తారు అనేది కూడా చూడాలి. ఇక వేరే పార్టీల నుంచి ఎవ‌రైనా సాయిరెడ్డి వెనుక న‌డుస్తారా అనేది కూడా త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.

Leave a Comment