వంగవీటి ఆశాకిరణ్ కొత్త నిర్ణ‌యం..

వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ రాజ‌కీయాల్లోకి రానున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఆమె కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆశా కిర‌ణ్ ఏ రాజ‌కీయ పార్టీలో చేరుతారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆమె జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చు అనే వార్త‌లు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె సోద‌రుడు రాధా ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయ‌నకు కూడా ఎమ్మెల్సీ అవ‌కాశం ఇస్తాము అని తెలిపారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇలాంటి స‌మయంలో ఆయ‌న రాజ‌కీయంగా సైలెంట్ గానే ఉన్నారు.

మ‌రో ప‌క్క లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల హాడావిడి క‌నిపిస్తోంది, ఆయ‌నకు విజ‌య‌వాడ మేయ‌ర్ గా అవ‌కాశం రానుంది అని రాధా పేరు వినిపిస్తోంది. ఇలాంటి వేళ ఆశాకిర‌ణ్ టీడీపీలో చేరే అవకాశం లేదు అంటున్నారు రాధా రంగా మిత్ర మండ‌లి. ఆమె జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రో ప‌క్క జ‌గ‌న్ స్ధాపించిన వైసీపీలో ఆమె చేరుతారా అంటే ఆమె వైసీపీలో చేర‌క‌పోవ‌చ్చు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆశాకిర‌ణ్ రాజ‌కీయంగా చూసుకుంటే చాలా యాక్టీవ్ అవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా చూస్తే ప‌రిణామాల బట్టీ, ఆమె జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చు అని తెలుస్తోంది. ఆమె జ‌న‌సేన‌లో చేరితే విజ‌య‌వాడ నుంచి ఆమెకి మేయ‌ర్ అవ‌కాశం ఇవ్వ‌చ్చు అనే చ‌ర్చ సాగుతోంది.

తాజాగా ఒక పొలిటిక‌ల్ అప్ డేట్ చూసుకుంటే ఆశాకిర‌ణ్ ఓ ఇంటిని అలాగే పార్టీకి సంబంధించి కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కృష్ణలంకలో ఒక ఇంటిని కొనుగోలు చేశారు, కుర్తాళం పీఠం పక్కన పాత పోస్టాఫీసు బజారులో పాత ఇంటిని కొనుగోలు చేశారు. ఈ రోజు అక్క‌డ భూమి పూజ చేశారు, ఇక్క‌డ కార్యాల‌యంతో పాటు ఇంటి అవ‌స‌రాల కోసం అక్క‌డ ఇంటిని కూడా నిర్మించ‌నున్నారు. మరికొద్ది రోజుల్లో ఆమె రాజకీయ రంగప్రవేశం చేయ‌నున్నారు.

Leave a Comment