నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న సినిమా ది ప్యారడైజ్.. ఇది ఫుల్ లోడెడ్ యాక్షన్ డ్రామా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇచ్చిన డేట్ గురించి చర్చ సాగుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉండగా ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమాను అక్టోబర్ 1వ తేదీకి మారుస్తారు అని టాక్ నడుస్తోంది. దీనికి ఒక కారణం ఉంది అంటున్నారు.ది ప్యారడైజ్ క్లైమాక్స్‌లో భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ ఉంది. ఈగ్రాఫిక్స్ వర్క్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది అని అంటున్నారు. అందుకే విడుదల తేది వాయిదా వేయాలి అని ఆలోచనలో ఉన్నారట. ఏకంగా నిర్మాత క్లైమాక్స్ సీజీకి కోటిన్నర నుంచి రెండు కోట్లు ఖర్చుచేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో వారం ఆలస్యంగా ఈ సినిమా రానుంది అంటున్నారు.
ఇక్కడ మరో అంశం ఏమిటి అంటే, నాగవంశీ నిర్మించిన ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 అక్టోబర్ 2న విడుదల ఉంది. ఒకవేళ నాని సినిమా అప్పుడు రిలీజ్ అయితే ఈ రెండిటికి మధ్య కాస్త ధియేటర్ల గ్యాప్ రావచ్చు. ముఖ్యంగా నాగవంశీ ప్యారడైజ్ నైజాం హక్కులు వాటాదారుగా ఉన్నారు, సో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అక్టోబర్ రెండో వారంలో విజయ్ దేవరకొండ రణబాలి, సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ అవ్వనున్నాయి.
ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్యారడైజ్ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 26 అలాగే ఆగస్ట్ 21 చివరకు సెప్టెంబర్ 24 న డేట్స్ వచ్చాయి. మరి చూడాలి వాయిదానా, లేదంటే అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది.







