స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వాడివేడిగా చర్చ జరుగుతోంది.. అక్టోబర్ నెల చివరి వారానికి పూర్తిగా ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తవుతాయి..ముందుగా మున్సిపల్ పీఠాలకు తర్వాత కార్పొరేషన్ ఆ తర్వాత చివరగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. జెడ్పి ఎన్నికల కోసం జెడ్పిటీసి ఎంపిటీసిలు సిద్దంగా ఉన్నారు.
ఇప్పటికే రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సుమారు వేలాది మంది ఆశావహులు సిద్ధమవుతూ ఉన్నారు
గ్రౌండ్ లెవెల్ నుంచి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారసుల ఎంట్రీ కూడా ఈసారి దాదాపు అన్ని పార్టీల నుంచి ఒక 15 నుంచి 20 మంది వారసులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుమార్తె లేదంటే కుమారుడు కోడలికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. మరి కొంతమంది వారి వెంట ఎప్పటినుంచో అనుచరులుగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన వాళ్ళు గత ఎన్నికల్లో టికెట్ వచ్చినా ఓటమి వచ్చిన వాళ్ళు ఇలా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున లిస్ట్ అయితే వినిపిస్తోంది. ఇటు తెలుగుదేశం జనసేన బిజెపీ కూటమిలో దాదాపు 10 నుంచి 12మంది వారసులకు ఇప్పటికే టికెట్లు కావాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కూడా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కూడా వారసులు ముందు వరుసలో వినిపిస్తూ ఉన్నారు.
విజయనగరం జెడ్పి స్థానం అదేవిధంగా మేయర్ స్థానం. ఈ రెండిటికీ కూడా పోటీ చాలా గట్టిగా
కనిపిస్తుంది. విజయనగరం నుంచి చూసుకున్నట్లయితే బొత్సా సత్యనారాయణ ఉత్తరాంధ్రలో చాలా సీనియర్ నాయకుడు ఆయన తన కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నాను అని ప్రకటించారు.
ఆయన 2024 లో చీపురుపల్లి నుంచి ఓటమి పాలైన తర్వాత పార్టీ తరపున ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
ఆయన కుమార్తె బొత్స అనూష డాక్టర్ గా ఉన్నారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.
ప్రస్తుతం ఆమె గ్రౌండ్ లెవెల్ లో పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
చీపురుపల్లి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. అయినా సరే పార్టీ స్టాండ్ తీసుకొని చాలా బలంగా వెళ్తున్నారు. జెడ్పిచైర్మన్ స్థానంలో తన కుమార్తెని కూర్చోబెట్టాలనే ఆలోచన బొత్స సత్యనారాయణ చేస్తూ ఉంటే మరోపక్క అక్కడ కిమిడీ కుటుంబం కూడా ఆ సీటు మీద అంతే ఎత్తున ఫోకస్ చేసింది.
విజయనగరం జడ్పీ పీఠం మీద జనసేన మినహా ఇటు తెలుగుదేశం పార్టీ గాని అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని పూర్తిగా ఫోకస్ చేశాయి. కూటమిలో చూసుకున్నట్లయితే మేయర్ స్థానం టిడిపి తీసుకుంటే జడ్పి స్థానాన్ని జనసేన కోరుతుంది.
ఇక్కడ కూడా బిజెపి రేస్ లో కనిపించడం లేదు.
జనసేన టిడిపి మధ్య ఇక్కడ ఎలాంటి ఒప్పందం జరుగుతుందో చూడాలి ఎందుకంటే రెండు స్థానాలు ఒకరు తీసుకునే అవకాశం ఉండదు.
మేయర్ స్థానం ఒకవేళ టిడిపి తీసుకుంటే జెడ్పి చైర్ పర్సన్ స్థానాన్ని ఇటు జనసేన కోరుకుంటుంది. సో ఈ రెండిటి మీద ఎటువంటి నిర్ణయం వస్తుంది అనేది రెండు మూడు సార్లు మీటింగ్స్ తర్వాత క్లారిటీ వస్తుంది.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కిమిడి కళా వెంకట్రావు అక్కడ ఎమ్మెల్యే గా గెలవడం జరిగింది. ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుని రాజకీయాల్లోకి తీసుకురావాలని కళా వెంకట్రావు ఎప్పటినుంచో ఆలోచన చేస్తున్నారు. ఇదే మంచి అవకాశం అనే ఆలోచన చేసి రామ్ మల్లిక్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దం అవుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కిమిడి కళా వెంకట్రావు తన వారసుడు రామమల్లిక్ నాయుడు కోసం చూస్తూంటే, మరో పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు.
వీళ్ళద్దరికీ కూడా నువ్వా నేనా అనే ఫైట్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ఉండబోతుంది.







