ఏఐ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు కొల్పోతున్నారు అనేది తెలిసిందే. అయితే లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం ఓ పక్క అయితే, మరో పక్క కంపెనీల ఆస్తులు పెరుగుతున్నాయి. అలాగే కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
తాజాగా చాలా మంది కుబేరులు కంపెనీల యజమానులు ఏఐ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సమయంలో ఏఐలో పెట్టుబడులు పెట్టిన వారి సంపద కోట్లలో పెరుగుతోంది.
2025 నాటికి బిలియనీర్ల మొత్తం ఆస్తి 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు ఒక నివేదిక చెబుతోంది. గత ఏడాది 2024తో పోలిస్తే 2025లో ఇది మరింత పెరిగింది అనేది తెలియచేస్తోంది ఈ నివేదిక. 2024తో పోలిస్తే దాదాపు 9 శాతం వీరి సంఖ్య పెరిగింది. 2025 నాటికి వారి సంఖ్య చూస్తే, 3790 మందికి కుబేరుల సంఖ్య పెరిగింది. వారి సంపద వృద్ది 13 శాతం పెరిగింది. ఇలా ఒకేసారి సంపద పెరగడం ఐదు సంవత్సరాల్లో జరగలేదు అంటున్నారు నిపుణులు.
అయితే ఇలా కంపెనీల విలువ అలాగే కుబేరుల సంఖ్య పెరగడానికి కారణం, వారు ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టడం. ఇక అల్ట్రాటా నివేదిక యూత్ కూడా తమ ఆదాయాన్ని మరింత పెరంచుకున్నారు అని తెలియచేసింది. దాదాపు 2024 నుంచి 2025కి 125 మంది యువ కుబేరులు ఉంటే, 2025 కి దాదాపు 185 కు ఈ సంఖ్య చేరింది.
సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ , ఈ టెక్నాలజీ కంపెనీలు 22 శాతం వృద్ది ఏఐ వల్ల సాధించాయి అని తెలియచేస్తున్నారు. ఇక ఈ కంపెనీలు స్ధాపించిన వారు పెట్టుబడి పెట్టిన వారు అలాగే వాటాలు కొనుగోలు చేసిన వారు లాభపడ్డారు. అమెరికాలోనే దాదాపు 1350 మంది బిలియనీర్లు ఉన్నారు .యూరప్ 1000 మంది ఉన్నారు. అనేది ఈ నివేదిక తెలియచేస్తుంది.







